అమరావతిపై తప్పుడు ప్రచారాలు: మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: కిరణ్ స్థలం: గుంటూరు

రాష్ట్ర రాజధాని అమరావతి అత్యంత సురక్షితమైనదని, నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో పూర్తయితే బొట్టు నీరు కూడా నిల్వ ఉండదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన మాట్లాడుతూ, వరద ముప్పు లేకుండా గత రెండు వందల ఏళ్ల వాతావరణ సరళులను అధ్యయనం చేసి పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను రూపకల్పన చేశామని తెలిపారు. అమరావతిపై ప్రజల్లో అనవసర భయాలు రేకెత్తించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.