దుబాయ్లో ఉపాధి కోసం వెళ్లి మృతిచెందిన ప్రవాస కార్మికుడు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Alur
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఆలూర్ మండల కేంద్రానికి చెందిన గడ్డం చరణ్ కరుణాకర్ ప్రమాదవశాత్తు మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 14న దుబాయ్ వెళ్లిన ఆయన, వారం రోజుల్లోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుడికి భార్య సునీత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన భర్త మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, దాతలు సహకరించాలని, ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఆమె ఆవేదనతో విజ్ఞప్తి చేశారు.