జీఎస్టీ వసూళ్లలో దూసుకుపోతున్న ఏపీ: దక్షిణాదిలో తొలి స్థానంలో నిలిచిన వైనం

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

అక్టోబరు నెలలో ఆంధ్రప్రదేశ్ లో జీఎస్టీ ఆదాయం నాలుగు వేల మూడు వందల ఏడు కోట్ల రూపాయలకు చేరిందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇరవై నాలుగు శాతం వృద్ధి నమోదైందని అధికారులు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ ఏపీయే అత్యధిక వృద్ధిని సాధించిందని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో కూడా పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగినట్లు పేర్కొన్నారు.