చిరుధాన్యాల సాగుపై హుస్నాబాద్లో రైతులకు ప్రత్యేక అవగాహన
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: హుస్నాబాద్
హుస్నాబాద్ మండలం శ్రీ రామ్ తండాలో వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల మరియు భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ సౌజన్యంతో చిరుధాన్యాలు, విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా జొన్న రకం విత్తనాలను సుమారు 50 మంది రైతులకు పంపిణీ చేశారు.