సికింద్రాబాద్ మైలార్‌గడ్డలో ఇమ్మడి శ్రీనివాస్ హత్య కేసు నిందితుడు అరెస్ట్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
సికింద్రాబాద్ మైలార్‌గడ్డలో సంచలనం సృష్టించిన ఇమ్మడి శ్రీనివాస్ హత్య కేసును చిలకలగూడ పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితుడు మహమ్మద్ నిజాముద్దీన్‌ను అరెస్ట్ చేశారు. వ్యాపార లావాదేవీలు మరియు షేర్ మార్కెట్ నష్టాల కారణంగా తలెత్తిన ఆర్థిక వివాదాల నేపథ్యంలో నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి కత్తి, దుస్తులు, స్కూటర్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ శశాంక్ రెడ్డి, ఎస్ హెచ్ ఓ రామకృష్ణ వెల్లడించారు.