కూటమి రాకతో ఆర్టీసీ ప్రయాణికులకు ఊరట: గతంలో వైకాపా హయాంలో ఛార్జీల భారం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అయ్యన్నపేట

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ ప్రయాణికులకు భారీ ఊరట దక్కిందని, స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పించామని అధికారులు తెలిపారు. వైకాపా హయాంలో ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచేసి ప్రయాణికులను నిలువుదోపిడీ చేశారని ఆరోపించారు. కొవిడ్ పేరిట రెండింతల భారాన్ని మోపారని పేర్కొన్నారు. గత రెండేళ్ల కాలంలో టిక్కెట్లపై ఎలాంటి ఛార్జీలు పెరగలేదని స్పష్టం చేశారు.