రాష్ట్రంలో ఐదు వేల ఆలయాల నిర్మాణం: మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి వెల్లడి

రిపోర్టర్: కిరణ్ స్థలం: సర్వేపల్లి

శ్రీవారి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దేవాలయాలు నిర్మిస్తామని మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి స్పష్టం చేశారు. పొదలకూరు మండలం మహ్మదాపురంలో ఎమ్మెల్యే సోమిరెడ్డితో కలిసి పర్యటించిన ఆయన, రెండు కోట్ల రూపాయలతో చేపట్టనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి భూమి పూజ చేశారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యున్నత ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని, రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఐదు వేల ఆలయాల నిర్మాణాలు పూర్తి కానున్నాయని తెలిపారు.