బీసీ రిజర్వేషన్ల కొట్టివేతపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం: సీఎం చంద్రబాబు స్పష్టీకరణ

రిపోర్టర్: శివ స్థలం: బాపట్ల

ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్లను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని అర్వపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ కాలం నుంచి వెనుకబడిన వర్గాలు అండగా నిలిచాయని గుర్తుచేశారు. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా పైకి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామని, రిజర్వేషన్ల విషయంలో కుట్రలు చేస్తున్న వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.