తిరుమలలో భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Tirumala
పెరటాసి మాసం మరియు సెలవుల నేపథ్యంలో తిరుమలకు భారీగా తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం బయట క్యూలైన్లలో తాగునీరు, పాలు, అన్నప్రసాదాలను నిరంతరం అందిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక మరుగుదొడ్లతో పాటు మొబైల్ ప్రథమ చికిత్స కేంద్రాలను సైతం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.