విజయవాడలో ఓటర్లకు నగదు పంపిణీ: ఎన్నికల సంఘానికి ఏబీ వెంకటేశ్వరరావు ఫిర్యాదు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయవాడ

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్ లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారంటూ మేయర్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర ఎన్నికల సంఘానికి శనివారం ఫిర్యాదు చేశారు. ఆదివారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నగరంలోని నలభై ఎనిమిది, యాభై తొమ్మిది డివిజన్లలో నగదు పంపిణీ చేస్తున్నట్లు ఉన్న రెండు వీడియోలను ఫిర్యాదుకు జతచేశారు. ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.