తుపాను బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి విట్ విరాళం
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
అర్నబ్, మురసు తుపాన్ల ప్రభావంతో నష్టపోయిన వారిని ఆదుకొనేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి అమరావతిలోని వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ రూ.కోటి విరాళం అందజేసినట్లు సంస్థ ఛైర్మన్ జి.విశ్వనాథన్ తెలిపారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును బుధవారం కలిసి ఈ విరాళానికి సంబంధించిన చెక్కును అందజేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు మరియు విట్ సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.