తండాలను అభివృద్ధి చేసింది కేసీఆర్ ప్రభుత్వమే: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
రిపోర్టర్: గోపి
స్థలం: మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. కేసీఆర్ హయాంలోనే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించి, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేశామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి వెనక్కి వెళ్తోందని విమర్శించారు. ఎల్లుండి అన్ని తండాల్లో కార్యక్రమాలు నిర్వహించి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలపాలని పిలుపునిచ్చారు.