యాదాద్రి జిల్లాలో దారుణం: శివసత్తు సుధాకర్ స్వామి భయానక హత్య
రిపోర్టర్: అశోక్
స్థలం: యాదాద్రి భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో శివసత్తు సుధాకర్ స్వామి గురూజీని దుండగులు దారుణంగా హత్య చేసినట్లు బంధువులు తెలిపారు. కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి, కాళ్లు చేతులు కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. బీరువాలో ఉన్న డెబ్బై తులాల బంగారం, నగదు అపహరించి నిందితులు స్కార్పియో వాహనంలో పరారయ్యారని, జీపీఎస్ ఆధారంగా బోధన్ పరిధిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.