ఎన్నికల సంఘం చీఫ్ జ్ఞానేశ్ కుమార్కు పద్మభూషణ్ ఇవ్వాలన్న బీజేపీ

రిపోర్టర్: సతీష్ స్థలం: పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్లో హింస లేని ఎన్నికలు నిర్వహించడంతో పాటు ఓటర్ జాబితా నుంచి అక్రమ చొరబాటుదారుల పేర్లను తొలగించినందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య డిమాండ్ చేశారు. పానిహటిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కొట్టిపారేశారు. ఈ ఎన్నికల ప్రక్రియ వల్ల రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ దక్కిందని, ఈసీ తీసుకున్న ప్రత్యేక చర్యలు అభినందనీయమని ఆయన వెల్లడించారు.