ట్యాంక్ బండ్పై హిట్ అండ్ రన్తో ఎస్ఐ దుర్మరణం

రిపోర్టర్: కిరణ్ స్థలం: Hyderabad

హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన విధుల్లో ఉన్న కొత్తగూడెం టూ టౌన్ ఎస్ఐ కె.వెంకన్నను గుర్తుతెలియని బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టి పరారైంది. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు.