ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన శివ ప్రసాద్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖైరతాబాద్
ఖైరతాబాద్ మహాగణపతిని తెలంగాణ హోమియోపతిక్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డా. చినుకని శివ ప్రసాద్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. అనంతరం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల వ్యవస్థాపకుల కుటుంబ సభ్యురాలు వీణ గారు డా. చినుకని శివ ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గణేష్ నవరాత్రులను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.