అమెరికాలో దారుణం: అంత్యక్రియల నిధులు కాజేసిన శ్మశానవాటిక మాజీ ఉద్యోగి

రిపోర్టర్: వెంకట్ స్థలం: Illinois

అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో శ్మశానవాటిక నిధులను అక్రమంగా కాజేసిన దారుణ ఘటన వెలుగు చూసిందని కుక్ కౌంటీ షెరీఫ్ టామ్ డార్ట్ తెలిపారు. మౌంట్ గ్లెన్వుడ్ మెమరీ గార్డెన్స్ సెమెట్రీలో పనిచేసిన లాట్రిసియా మార్షల్ పారిస్ అనే మాజీ ఉద్యోగి, అంత్యక్రియల ఖర్చులు మరియు రాతి శిలల కొనుగోళ్ల కోసం కుటుంబాల నుండి వసూలు చేసిన లక్షా పద్నాలుగు వేల డాలర్లకు పైగా సొమ్మును నొక్కేసిందని అధికారులు స్పష్టం చేశారు.