వర్ధన్నపేటలో ఘనంగా 9వ పోషణ్ మాస ఉత్సవాలు నిర్వహించిన ఎమ్మెల్యే
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో నిర్వహించిన 9వ పోషణ్ మాస ఉత్సవాలలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని సామూహిక శ్రీమంతాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లి మరియు పిల్లల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.