ధర్మవరం మున్సిపల్ ఎన్నికలు: కూటమి అభ్యర్థులను గెలిపించాలని పరిటాల శ్రీరామ్ పిలుపు

రిపోర్టర్: గోపి స్థలం: శ్రీ సత్యసాయి

నవంబర్ మొదటి తేదీన జరిగే ధర్మవరం మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటు హక్కును కూటమి అభ్యర్థుల పక్షాన వినియోగించుకోవాలని ధర్మవరం తెలుగు దేశం పార్టీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. స్థానిక పట్టణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ ఆయన సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వ పాలనకు మద్దతుగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు.