గంజాయి నిర్మూలనకు ప్రత్యేక నిఘా: టెస్టింగ్ కిట్లతో ముమ్మరంగా తనిఖీలు

రిపోర్టర్: హరి స్థలం: విజయనగరం

మాదకద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజయనగరం పోలీసుల ఆధ్వర్యంలో గంజాయిపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు Vijayanagaram Police వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక టెస్టింగ్ కిట్లతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ రహిత వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు ఏపీ ఈగల్ టీమ్ ఎంతో కృషి చేస్తోందని, యువత భవిష్యత్తును కాపాడటానికి నిరంతరం అప్రమత్తంగా ఉంటూ కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు.