అమరావతిలో రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు ప్రారంభం
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
ఈ నెల 10, 11 తేదీల్లో అమరావతి సచివాలయంలో 8వ కలెక్టర్ల సదస్సు జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ సదస్సును ప్రారంభించి దిశానిర్దేశం చేయనున్నారు. స్వర్ణాంధ్ర-2047 రోడ్‌మ్యాప్, సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్, శాంతిభద్రతలు, జిల్లాల వారీగా ఉత్తమ విధానాలపై కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించనున్నారు. పాలనలో పారదర్శకత, ఈ-గవర్నెన్స్, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.