నిరుద్యోగులకు గుడ్ న్యూస్: డిసెంబర్ 1 నుంచి ఏపీపీఎస్సీ రాత పరీక్షలు ప్రారంభం

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అలాగే ఆర్జీయూకేటీ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల షెడ్యూల్ ను ఏపీపీఎస్సీ ఖరారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ పరీక్షలను డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ ద్వారా పరిశీలించుకోవాలని సూచించారు.