ఎమ్మిగనూరులో కార్డెన్ అండ్ సెర్చ్ వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

రిపోర్టర్: రమేష్ స్థలం: కర్నూలు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పరిధిలోని కడిమెట్ల గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల వివరాలను Kurnool Police అధికారికంగా వెల్లడించారు. మొత్తం 40 మంది పోలీసు సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొని అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 18 బైకులు మరియు 2 బొలేరో వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలందరూ పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.