ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన: డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే కొత్త రూల్స్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: India
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు కేంద్రం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రతి తప్పిదానికి డ్రైవింగ్ లైసెన్స్‌లో పాయింట్లు కట్ చేసే గ్రేడెడ్ పాయింట్ల విధానాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. పదేపదే నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు కానుంది. అదే సమయంలో, బాధ్యతాయుత డ్రైవర్లకు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు కల్పించేలా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.