భారత్-రష్యా బంధం: బయటి శక్తులు ఏమీ చేయలేవంటూ స్పష్టం చేసిన మాస్కో
రిపోర్టర్: సతీష్
స్థలం: దిల్లీ
భారత్-రష్యా మధ్య ఉన్న బలమైన సంబంధాలను ఎలాంటి బయటి శక్తులు మార్చలేవని రష్యా రాయబార కార్యాలయ ప్రతినిధి పెట్ర్ సిజోవ్ స్పష్టం చేశారు. దిల్లీలో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మారుతున్న ప్రపంచ రాజకీయాల మధ్య కూడా ఇరు దేశాల బంధం కాల పరీక్షకు తట్టుకుని నిలబడిందని తెలిపారు. మహాత్మా గాంధీ, లియో టాల్స్టాయ్ ల మధ్య ఉన్న చారిత్రక అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.