ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల గమ్యస్థానంగా మారుస్తున్నామంటూ నారా లోకేష్ ప్రకటన

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఎన్టీఆర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారని దేవినేని ఉమామహేశ్వరరావు - మాజీ మంత్రి, మైలవరం వెల్లడించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారని తెలిపారు. వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడమే కూటమి ప్రభుత్వ విధానమని ఆయన పేర్కొన్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందని, ముందుకు రావాలని దేశీయ అలాగే విదేశీ కంపెనీల ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారని వివరించారు.