తెలుగు వారికోసం ఇమ్మిగ్రేషన్ నిబంధనలపై తానా ప్రత్యేక అవగాహన సదస్సు
రిపోర్టర్: అశోక్
స్థలం: అమెరికా
అమెరికాలో మారుతున్న ఇమ్మిగ్రేషన్ నిబంధనలపై తెలుగు వారికి పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో జూమ్ వేదికగా ప్రత్యేక సదస్సు నిర్వహించారు. తానా ఎన్నారై స్టూడెంట్స్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉమా ఆర్ కటికి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఇమ్మిగ్రేషన్ అటార్నీ సంతోష్ ఆర్ సోమిరెడ్డి ముఖ్య వక్తగా హాజరై హెచ్-వన్ బి, గ్రీన్ కార్డ్ మరియు వీసా ప్రక్రియలలో ఎదురయ్యే సవాళ్లపై సవివరంగా వివరించి నిపుణుల సలహాలు అందించారు.