వైసీపీ నేతల దాడులపై టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరిక

రిపోర్టర్: వెంకట్ స్థలం: Amaravati

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలు, ఘర్షణలపై వైసీపీ నేతలను టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. పుంగనూరు, రాయచోటి, ధర్మవరం ప్రాంతాల్లో వైసీపీ కిరాయి గుండాలు విధ్వసానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికలను సజావుగా జరగకుండా అడ్డుకోవాలని చూస్తే ఊరుకోమని, వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం పూర్తిగా నాశనం అయిందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.