ఆస్కార్ వేదికపై తమిళంలో మాట్లాడటమే నా లక్ష్యమంటూ అగ్ర దర్శకుడు అట్లీ ప్రకటన

రిపోర్టర్: అశోక్ స్థలం: చెన్నై

ఆస్కార్ అవార్డు అందుకోవాలనేది తన చిన్ననాటి కల అని, దాని కోసం శక్తివంచన లేకుండా కష్టపడుతున్నానని ప్రముఖ దర్శకుడు అట్లీ వెల్లడించారు. చెన్నైలో జరిగిన ఓ సినీ వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఆస్కార్ వేదికపై తమిళంలో మాట్లాడాలని ఆశగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న రాకా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని, ఈ చిత్రాన్ని ఆస్కార్ బరిలో నిలిపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.