ఆనంద్ దేవరకొండ 'ఎపిక్' మూవీ పబ్లిక్ టాక్

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీమియర్ షోల ద్వారా ప్రేక్షకులను పలకరించింది. తండ్రి, కొడుకుల మధ్య అనుబంధం, మిడిల్ క్లాస్ భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నప్పటికీ, సెకండాఫ్ కొద్దిగా సాగదీసినట్లు టాక్ వినిపిస్తోంది.