ఈడీ అధికారుల సోదాలను వ్యతిరేకిస్తూ జీఎంఏడీఏ కార్యాలయం వద్ద ఆప్ నిరసన

రిపోర్టర్: రాము స్థలం: చండీగఢ్

పంజాబ్‌లోని మొహాలీ గ్రేటర్ మొహాలీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలో మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. దీనిని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. వందలాది మంది ఆప్ కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణకు దిగి ఈడీకి చెందిన ఒక వాహనాన్ని ధ్వంసం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ సాధనంగా బీజేపీ వాడుకుంటోందని ఆప్ నేతలు ఆరోపించగా, విపక్షాలు ఈ చర్యలను ఖండించాయి.