గాంధారిలో ఏటీఎం చోరీ కలకలం: గ్యాస్ కట్టర్తో పగలగొట్టి నగదు దోపిడీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: Kamareddy

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో అర్ధరాత్రి ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించిన దొంగలు గ్యాస్ కట్టర్ను ఉపయోగించి మిషన్ను పగలగొట్టారని, అందులోని నగదును దోచుకుని పరారయ్యారని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం దీనిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, అధికారులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు వేగవంతం చేశారు.