బెంగళూరులో విజయవాడ ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం

రిపోర్టర్: శివ స్థలం: బెంగళూరు

బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడకు బయలుదేరాల్సిన ఇండిగో విమానంలో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్‌కు ముందు సమస్యను గుర్తించిన పైలట్లు విమానాన్ని టెర్మినల్ బేకు వెనక్కి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విమానంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. లోపాన్ని సరిదిద్దేందుకు సాంకేతిక సిబ్బంది చర్యలు చేపట్టారు.