వైభవంగా సాగిన ఖైరతాబాద్ మహా గణేష్ నిమజ్జన ఘట్టం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Hyderabad

నగరంలో అత్యంత వైభవంగా సాగిన గణేష్ ఉత్సవాల ముగింపు ఘట్టంలో భాగంగా హైదరాబాద్ ఖైరతాబాద్ మహా గణేష్ నిమజ్జన ఉత్సవం అత్యంత ఘనంగా ముగిసిందని అధికారులు తెలిపారు. శోభాయాత్రగా బయలుదేరిన మహా గణనాథుడిని ఎన్టీఆర్ మార్గ్లోని క్రెయిన్ నంబర్ ఐదు వద్దకు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై అంటూ భక్తుల జయధ్వానాలు, డప్పు వాయిద్యాల నడుమ వినాయకుడికి భక్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. హుస్సేన్సాగర్ పరిసర ప్రాంతాలు భక్తజనసందోహంతో కిక్కిరిసిపోయాయి.