పీఎంశ్రీ పాఠశాలల్లో డైస్ కార్యక్రమం: విద్యార్థులకు ప్రత్యేక నిధుల కేటాయింపు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విజయనగరం
విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు రేకెత్తించడంతో పాటు భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పీఎంశ్రీ పాఠశాలల్లో డైస్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు విజయనగరం జిల్లాలో పది పాఠశాలలను ఎంపిక చేసి ఒక్కో దానికి రూ.1.24 లక్షల ప్రత్యేక నిధులను కేటాయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఇంజినీరింగ్ కళాశాలల నిపుణుల ద్వారా సాంకేతిక పరిశోధన మరియు వ్యాపార మెలకువల్లో తర్ఫీదు ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు.