తలసేమియా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరం

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం అర్బన్ పరిధిలో తలసేమియా చిన్నారుల కోసం సంకల్ప స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన నిపుణులైన హెమటాలజిస్ట్ డాక్టర్ దండమూడి రమణ నేతృత్వంలోని వైద్య బృందం చిన్నారులను క్షుణ్ణంగా పరీక్షించింది. ఈ సందర్భంగా రక్త పరీక్షలు మరియు స్కానింగ్ రిపోర్టులను పరిశీలించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. పిల్లల ఆరోగ్య భద్రత కోసం తల్లిదండ్రులు వైద్యుల సూచనలను తూచా తప్పకుండా పాటించాలని, ప్రతి మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు హితవు పలికారు.