పాలకొండలో చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ హరి అకాల మరణంతో తీరని విషాదం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పాలకొండ

పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రిలో చిన్న పిల్లల వైద్యులుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ హరి మడుగుల నిన్న రాత్రి ఒంటి గంటకు మరణించారు. ఈ అకస్మిక మరణంతో ఆసుపత్రి సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణలో ప్రాంతీయ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ తో పాటు సహచర వైద్యులు అందరూ ఘనంగా నివాళులర్పించారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.