మార్డదర్శి చిట్ ఫండ్ అరుదైన ఘనత: రూ.వంద కోట్ల మైలురాయి అందుకున్న తమిళనాడు శాఖ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: చెన్నై

చిట్ ఫండ్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న మార్గదర్శి చిట్ ఫండ్ తమిళనాడు శాఖ అరుదైన ఘనత సాధించిందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచ్ల నెలవారీ టర్నోవర్ రూ.వంద కోట్ల మైలురాయిని అందుకున్నట్లు ఆ సంస్థ తమిళనాడు విభాగం డైరెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. చెన్నైలోని నుంగంబాక్కం ప్రధాన కార్యాలయంలో సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. 2027 మార్చి నాటికి కేవలం తమిళనాడులోనే రెండు వేల కోట్ల టర్నోవర్కు చేరుకుంటామని, నవంబర్ లో మరో రెండు కొత్త శాఖలను ప్రారంభిస్తామని తెలిపారు.