గత ప్రభుత్వ విద్యుత్ నిర్ణయాలపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో విద్యుత్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి పరిస్థితి, బొగ్గు కొరత, గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రంపై పడుతున్న ఆర్థిక భారంపై అధికారులను రేవంత్ నిలదీశారు. సింగరేణిలో బొగ్గు బ్లాకులు లేనప్పుడు ప్లాంట్ను ఎలా నిర్మించారని ప్రశ్నించారు.