జైలులో ప్రజ్వల్ రేవన్నా మొబైల్‌లో డజన్ల కొద్దీ అశ్లీల వీడియోలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: కర్ణాటక

బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నా వద్ద లభించిన మొబైల్ ఫోన్, ఇతర పరికరాలను ఫోరెన్సిక్ విశ్లేషణ చేయగా డజన్ల కొద్దీ అశ్లీల వీడియోలు వెలుగుచూశాయి. క్రైమ్ బ్రాంచ్ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీలలో రేవన్నా సెల్ ఫోన్ వాడుతూ పట్టుబడటంతో జైళ్లలో వీఐపీ ఖైదీలకు అందుతున్న ప్రత్యేక సౌకర్యాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.