రైతుల సెల్ఫ్ డిక్లరేషన్ దుస్థితిపై కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ తీవ్ర నిప్పులు
రిపోర్టర్: అశోక్
స్థలం: రాజన్న సిరిసిల్ల
ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పాలనలో నేడు రైతుల సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (KTR) విమర్శించారు. రాజన్న సిరిసిల్ల ప్రాంతంలో రైతులు జెనరేటర్లు, ట్యాంకర్లతో పంటలను కాపాడుకోవాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్రాప్ హాలిడే ప్రకటించేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని పేర్కొంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే అన్నదాతలు రోడ్డెక్కాల్సి వస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.