మర్రిపాడులో ఎడతెరిపిలేని వర్షంతో నామినేషన్లకు అభ్యర్థుల అవస్థలు

రిపోర్టర్: Darsigunta Naveen స్థలం: మర్రిపాడు

మర్రిపాడు మండలంలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. నామినేషన్ల చివరి రోజు కావడంతో పత్రాలు సమర్పించేందుకు వస్తున్న అభ్యర్థులు, వారి అనుచరులు జోరువాన కారణంగా నానా తంటాలు పడుతున్నారు. ఎన్నికల సందడి నెలకొన్న వేళ కురిసిన ఈ భారీ వర్షం అందరినీ ఆందోళనకు గురిచేసింది.