కాకినాడ పోర్టు నుంచి మహారాష్ట్రకు దేశంలోనే తొలిసారిగా ఉడ్ పల్ప్ రైలు రవాణా

రిపోర్టర్: వెంకట్ స్థలం: ಕಾకినాడ

భారతీయ రైల్వే చరిత్రలో తొలిసారిగా కాకినాడ పోర్టు నుంచి మహారాష్ట్రలోని భిగ్వాన్‌కు కలప గుజ్జు (ఉడ్‌ పల్ప్‌) రైలు మార్గంలో రవాణా అయింది. పదిహేనేళ్లుగా రోడ్డు మార్గానికే పరిమితమైన ఈ రవాణాను రైల్వే అధికారులు చర్చల ద్వారా రైలు మార్గానికి మళ్లించారు. టారిఫ్ నిబంధనలను సవరించడంతో పరిశ్రమలు ముందుకు రావడంతో, ఈ రవాణా ద్వారా రైల్వే శాఖకు ఏటా సుమారు రూ. 20 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది.