ప్రపంచ దేశాల అసలు విస్తీర్ణంతో కొత్త మ్యాప్‌కు ఐరాస ఆమోదం
రిపోర్టర్: హరి
స్థలం: World
ప్రపంచ దేశాల భౌగోళిక విస్తీర్ణాన్ని వాస్తవికతకు అనుగుణంగా చూపే 'ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్' మ్యాప్‌ను రూపొందించేందుకు ఐక్యరాజ్యసమితి చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది. 164 దేశాల మద్దతుతో ఈ నిర్ణయం తీసుకోగా, భారత్ దీనికి అనుకూలంగా ఓటు వేసింది. అయితే, అమెరికా ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. మెర్కేటర్ మ్యాప్‌లోని లోపాలను సరిదిద్దుతూ, ఖండాల అసలు పరిమాణాన్ని ప్రపంచానికి తెలియజేయడమే ఈ కొత్త మ్యాప్ ముఖ్య ఉద్దేశ్యం.