రాప్తాడు ఘటన: నిందితుడు హేమంత్ కుడి కాలు తొలగింపు

రిపోర్టర్: శివ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యార్థినిపై రంపంతో దాడి చేసి పోలీసు కాల్పుల్ లో గాయపడిన నిందితుడు హేమంత్ కుడి కాలును వైద్యులు తొలగించినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అత్యవసర సర్జరీ నిర్వహించి మోకాలి పైవరకు కుడి కాలును తొలగించామని, ఎడమ కాలికి కూడా చికిత్స అందించామని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు.