సరిహద్దులో ఉద్రిక్తత: కొఠియా గ్రామాల్ లో ఎన్నికలను అడ్డుకుంటున్న ఒడిశా యంత్రాంగం
రిపోర్టర్: వెంకట్
స్థలం: సాలూరు
ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్ లోని కొఠియా వివాదాస్పద గ్రామాల్ లో స్థానిక ఎన్నికల వేళ ఉద్రిక్తత నెలకొందని స్థానిక అధికారులు తెలిపారు. సాలూరు మండల పరిధిలోని ఇరవై ఒకటి గ్రామాల్ లో ఎన్నికలను అడ్డుకునేందుకు ఒడిశా యంత్రాంగం దూకుడుగా వ్యవహరిస్తోందని, నిబంధనలను ఉల్లంఘిస్తూ పికెట్లు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఒడిశా ప్రభుత్వ తీరు వల్ల సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అధికారులు వెల్లడించారు.