తెలంగాణ ఏవియేషన్ అకాడమీతో సాంకేతిక విద్యాశాఖ చారిత్రాత్మక ఒప్పందం
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
తెలంగాణలోని విద్యార్థులకు విమానయాన రంగంలో అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో సాంకేతిక విద్యాశాఖ హైదరాబాద్ పాత ఎయిర్పోర్ట్లో ఉన్న తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సచివగాలయంలో డాక్టర్ కె. కేశవరావు సమక్షంలో జరిగిన ఈ ఒప్పందం ద్వారా జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రత్యక్ష శిక్షణ లభిస్తుంది.