విజయనగరంలో మొట్టమొదటిసారిగా మహిళల కోసం శ్రీమతి విజయనగరం పోటీలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
విజయనగరంలో మొట్టమొదటిసారిగా మహిళల కోసం శ్రీమతి విజయనగరం పోటీలను నిర్వహిస్తున్నట్లు ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అక్టోబర్ 30వ తేదీన ఈ కార్యక్రమం జరగనుందని పేర్కొన్నారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా చీరకట్టులో మహిళల శక్తిని చాటేలా ఈ వేడుకను రూపకల్పన చేశామని నిర్వాహకులు వెల్లడించారు. స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.