యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి సన్నిధిలో ఘనంగా ప్రత్యేక పూజలు చేసిన బండారు దత్తాత్రేయ
రిపోర్టర్: P.srinu
స్థలం: భువనగిరి
హరియాణా మాజీ గవర్నర్ మరియు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మరియు అధికారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. భక్తులు భారీగా తరలివచ్చారు.