సినిమాల్లో సున్నితమైన అంశాల చిత్రీకరణపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

రిపోర్టర్: విజయ్ స్థలం: New Delhi

సినిమాల్లో సున్నితమైన అంశాల చిత్రీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కు సంబంధించిన సవరించిన నిబంధనలను నోటిఫై చేసింది. దాదాపు 35 ఏళ్ల తర్వాత 1991 నాటి మార్గదర్శకాలను మారుస్తూ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చారు. ముఖ్యంగా డ్రగ్స్ వినియోగం, హింస, మహిళలు మరియు చిన్నారుల రక్షణ వంటి అంశాలపై కఠిన ఆంక్షలు విధిస్తూ ఈ మార్గదర్శకాలు జారీ అయ్యాయి.